Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు ఈ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, 'కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి వారి సేవ కోసం ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నాకు బోర్డ్ సభ్యునిగా సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు పాదాభివందనం చేస్తున్నాను. నా విధేయతని గుర్తించి స్వామి వారి సేవ చేసుకునే అదృష్టం కల్పించారు. తోటి బోర్డ్ సభ్యులతో కలిసి మరిన్ని మంచి బృహత్తర కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నావంతు ప్రయత్నం చేస్తాను' అని చెప్పారు.