Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2023లో జరగబోయే శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ఠాపన ప్రారంభోత్సవం కోసం ఎన్జేలోని ఎడిసన్ సిటీలో ఒక ప్రధాన భూమిని కేటాయించడానికి ఎడిసన్ సిటీ మేయర్ సమ్మతించారని నాసా (నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్) తెలిపింది.
ఇటీవల ఎడిసన్ నగరం ఒక నిర్దేశిత ప్రాంతంలో ప్రపంచ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయడానికి చొరవ చూపింది. ఈ నేపథ్యంలోఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రతిపాదనను నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ తీసుకొచ్చారని 'నాసా' తెలిపింది. యునైటెడ్ స్టేట్స్లో పబ్లిక్ ప్లేస్‌లో ఎన్టీఆర్‌ది మొదటి విగ్రహం కావడం విశేషం. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, సంస్కరణలను తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అంతేకాదు తెలుగు ప్రజలు గర్వించేలా మరొక గొప్ప విజయం అవుతుంది. ఈ కార్యక్రమానికి నాసా నిధులు సమకూరుస్తుంది.