Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య, నాటి తరం కథానాయకుడు హరనాథ్ కూతురు పద్మజా రాజు (54) మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు.
పవన్‌కళ్యాణ్‌తో 'గోకులంలో సీత', 'తొలిప్రేమ', శేఖర్‌కమ్ములతో 'గోదావరి' వంటి తదితర చిత్రాలను పద్మజారాజు భర్త జివిజిరాజు నిర్మించారు. ఆమె అన్నయ్య శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే.
ఇటీవల పద్మజారాజు తన తండ్రి హరనాథ్ గురించి 'అందాలనటుడు' పేరుతో ఓ పుస్తకం వెలుగులోకి తెచ్చారు. ఆ పుస్తకాన్ని నటశేఖర కష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. త్వరలోనే తన కుమారుల్లో ఒకరిని నిర్మాతగా పరిచయం చేయబోతున్నానని ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆమె తెలిపారు. రాబోయే కొత్త ఏడాదిలో నిర్మాతగా తన తనయుడిని చూడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పిన ఆమె ఆకస్మిక మృతి జివిజిరాజు ఇంట విషాదాన్ని నింపింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరి, జీవీజీ రాజు, ఆయన కుమారులకు మనో ధైర్యం లభించాలని పలువురు సినీ ప్రముఖులు అభిలషించారు.