Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కుమారి 21 ఎఫ్' తరువాత '18 పేజిసి' కథను ఎంచుకోవడానికి
కారణం ఏంటంటే, ఈ కథ క్యారెక్టర్స్ జర్నీ. వాళ్ళ ప్రపంచంలోకి మనం వెళ్తాం. అన్ని రకాల ఎమోషన్స్ కలిపి ఇందులో ఉంటాయి. ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మాత్రమే కాదు.
దీనిలో బోలెడన్ని ఎమోషన్స్ ఉన్నాయి.
సినిమా చూస్తున్న రెండు గంటలు మాత్రం ఆడియన్స్ వాళ్ళని వాళ్లే క్వశ్చన్ చేసుకుంటారు. ఈ సినిమాలో ఫీలింగ్ ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఏం జరుగుతుందా అనే చిన్న థ్రిల్లింగూ ఉంటుంది. అయితే సినిమా ఎండింగ్ మాత్రం అలా గుర్తుండిపోతూ బయటకు వస్తారు. 'కార్తికేయ 2' తరువాత నిఖిల్ ఫేమ్ మారిపోయింది. అయితే ఈ కథలో ఏమైనా మార్పులు చేశారా అని చాలా మంది అడిగారు. నేను కథని కథలానే ట్రీట్ చేస్తాను. మేం స్ట్రాంగ్‌గా నమ్మేది కథను మాత్రమే. నా గురువు సుకుమార్ అన్నయ్య నేర్పించింది ఏంటి అంటే ఇక్కడ కథే గొప్పది.ఈ సినిమాని గీతా ఆర్ట్స్‌లో
చేయడం నిజంగా ఒక హానర్. మీరు ఎక్కడ చేస్తున్నారు అని బయట అడిగినప్పుడు గీతా ఆర్ట్స్‌లో చేస్తున్నాం అంటే మనకు ఒక గౌరవం వస్తుంది. అలానే గీతాఆర్ట్స్‌కి ఒక కథ తీసుకొచ్చినప్పుడు కథకు సంబంధించి మీరు
కాంప్రమైజ్ అయినా, వాళ్ళు అవ్వనివ్వరు. అరవింద్, వాసుగారు ప్రొడక్షన్ చాలా బాగా ప్లాన్ చేసుకుంటారు.
దీని తర్వాత మైత్రి మూవీలో ఓ సినిమా, అలాగే సితార ఎంటెర్టైమెంట్స్లో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.