Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం '18 పేజిస్'. నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఈనెల 23న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. అగ్రకథానాయకుడు అల్లు అర్జున్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఆయన మాట్లాడుతూ, 'నా ఫెవరేట్ పీపుల్ ఈ సినిమా చేస్తున్నారు. గోపీ మ్యూజిక్ చాలా బాగుంది. ప్రతాప్‌ను 'ఆర్య' సినిమా నుంచి చూస్తున్నా, ఇస్తే మంచి సినిమానే ఇవ్వాలి అని వెయిట్ చేసి మరి సినిమా చేశాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. 'కార్తికేయ2'తో హిట్ కొట్టిన నిఖిల్‌కి కంగ్రాట్స్. ఈ సినిమాకి వీళ్ళు పెట్టిన ఎఫోర్ట్స్ మీ హార్ట్‌కి టచ్ అవుతుంది' అని తెలిపారు.
'ప్రతి సినిమా నాకు 5% నేర్పిస్తే ఈ సినిమా 25% నేర్పించింది. నా లైఫ్‌లో బన్ని 100% అయితే సుకుమార్ 75%, దిల్ రాజు 25% ఇవన్నీ కలిపితే మా అరవింద్ గారు. బన్ని లేకుండా నా ఫంక్షన్ జరగదు' అని నిర్మాత బన్నీవాసు చెప్పారు.
హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ, 'సుకుమార్ నాకు నందిని క్యారెక్టర్‌ను రాసినందుకు థ్యాంక్యూ' అని తెలిపారు. 'ఈ సినిమాను ఓటిటిలో అప్పుడే రిలీజ్ చేయం. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్‌కి వచ్చి సినిమా చూడండి' అని అల్లు అరవింద్ అన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ,'నా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఐకాన్ స్టార్ అటెండ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. బన్ని వాసుకి థ్యాంక్యూ. సూర్యప్రతాప్ ఒక చిన్న పాపలా ఈ సినిమాను దాచారు. సుకుమార్ తీసిన సినిమాలు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన రాసిన పాత్రలో కనిపించడం నా అదృష్టం' అని చెప్పారు.
నేను ప్రొడ్యూసర్ అవుదామని
'జగడం' అప్పుడే అనుకున్నా. నేను 'హ్యాపీడేస్' సినిమా టైమ్‌లో నిఖిల్‌కి లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. అప్పుడే అతడు సక్సెస్ అవుతాడు అని నాకు అర్థమైంది. నా జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితిలో బన్నీవాసు తోడుగా ఉన్నాడు. తమ్ముడు ప్రతాప్ నా ప్రతికథలోనూ భాగమే. పాటల రచయిత శ్రీమణిని పరిచయం చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతుంటాను.అనుపమ నా 'రంగస్థలం' చేయాల్సింది. కొన్ని కారణాలు వలన చేయలేదు. కానీ ఖచ్చితంగా కలిసి పని చేస్తాం.నా రైటింగ్‌లో వచ్చిన ప్రతి సినిమాకి బన్ని వచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సినిమా రషెస్ నచ్చి రత్నవేలు కొన్ని షాట్స్ చేసినందుకు థ్యాంక్స్.
- దర్శకుడు సుకుమార్