Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాల్ కథానాయకుడిగా ఏ.వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతున్న పాన్ ఇండియా మూవీ 'లాఠీ'. సునైనా కథానాయికగా నటిస్తోంది. రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఈనెల 22న ఈ సినిమా అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతి ఎస్డీహెచ్ఆర్ జూనియర్ కాలేజ్‌లో గ్రాండ్‌గా జరిగింది.
అగ్ర హీరో మోహన్‌బాబు ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, 'విశాల్ నాన్న నాతో 'యం. ధర్మరాజు ఎం.ఎ' లాంటి అద్భుతమైన సినిమా తీశారు. ఆయన నా నిర్మాత. పోలీస్ అనే పదాన్ని గౌరవిస్తాను. అందులో కానిస్టేబుల్ నుండి వచ్చిన వారంటే మరింత గౌరవం. ఇలాంటి ఒక గొప్ప కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశాల్. ఈ సినిమా కూడా 'పందెంకోడి'లా ఆడుతుంది. ఇది గ్యారెంటీ హిట్' అని తెలిపారు.
'మోహన్ బాబుకి నేను మూడో కొడుకుని. నేను హీరో అవ్వడానికి కారణం.. మోహన్ బాబు. 'యం. ధర్మరాజు ఎం.ఎ' షూటింగ్‌కి నాన్నతో వెళ్తే, ఈ అబ్బాయి మొహంలో కళ ఉంది తప్పకుండా హీరో అవుతాడు అని చెప్పారు. ఆనాడు ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఈ సినిమా ప్రతి కానిస్టేబుల్‌కి ఒక ట్రిబ్యూట్. సమాజం మేలు కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తారు. నేను రీల్ లైఫ్ హీరో. వాళ్ళు రియల్ లైఫ్ హీరోలు. వాళ్ళే స్ఫూర్తి. పీటర్ హెయిన్స్ మాస్టర్ ఎక్స్టార్డినరీ యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేశారు' అని హీరో విశాల్ అన్నారు.