Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెలుగు, తమిళంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం 'వారసుడు' (తమిళంలో వారిసు). ఈ సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయిక నటిస్తోంది.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలోని తొలిపాట చార్ట్‌బస్టర్ నంబర్ 'రంజితమే' ఇప్పటివరకు 100 మిలియన్ల వ్యూస్ సాధించింది. రెండవ పాట 'థీ దళపతి' కూడా మ్యూజికల్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. తాజాగా 'ఇట్స్ ఫర్ యూ అమ్మ' అనే మూడో సింగిల్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాట వారసుడు సోల్, కథకు కీలకమైన అమ్మ సెంటిమెంట్‌ను తెలియజేస్తోంది. సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి రాసిన మ్యాజికల్ పదాలకు కెఎస్ చిత్ర స్వీట్, సోల్ ఫుల్ వాయిస్‌ని అందించింది. తమన్ అందమైన ట్యూన్, సోల్ స్ట్రిగింగ్ మ్యూజిక్‌తో పాటని అద్భుతంగా స్వరపరిచారు.ముగ్గురూ కలిసి తల్లి గురించి ఒక అందమైన రెండిషన్ అందజేశారు. ఈ పాట వెంటనే శ్రోతల హదయాల్లోకి వెళ్లి తల్లి గురించిన జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. తెలుగులో అమ్మ గురించి కొన్ని క్లాసిక్ సాంగ్స్ ఉన్నాయి. ఈ పాట కూడా ఆ వరుసలో చేరుతుంది. ఇది సినిమా గురించి మంచి వైబ్ ఇవ్వడమే కాకుండా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పాటతో 'వారసుడు' వంశీ పైడిపల్లి స్టైల్లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మేకర్స్ తెలియజేశారు.