Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రాజయోగం'. ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. రామ్ గణపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ''రాజయోగం' ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో రొమాన్స్, యాక్షన్, కామెడీ వంటి అన్ని కమర్షియల్ అంశాలున్నాయి. నా స్నేహితుడు గణపతి ఈసారి కంప్లీట్ కమర్షియల్ సినిమా చేశాడు. హీరో సాయి రోనక్ కూడా మార్షల్ ఆర్ట్స్, యాక్టింగ్‌లో ప్రతిభ చూపించారు. ఇండిస్టీలో ఉన్న పేరున్న కమెడియన్లంతా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. నిర్మాత మణి లక్ష్మణ్‌కి కంగ్రాంట్స్. ఈ సినిమా యూనిట్ అందరికీ రాజయోగం తీసుకురావాలని కోరుకుంటున్నా' అని తెలిపారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్‌కు మంచి అప్లాజ్ వస్తుండగా, తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా అన్ని కమర్షియల్ హంగులతో ఆకట్టుకుని సినిమా మీద అంచనాలు పెంచుతోంది అని చిత్ర యూనిట్ పేర్కొంది. అజరు ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - విజరు సి కుమార్, ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్, సంగీతం - అరుణ్ మురళీధరన్, డైలాగ్స్ - చింతపల్లి రమణ, సహ నిర్మాతలు - డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్, నిర్మాత - మణి లక్ష్మణ్ రావు, రచన దర్శకత్వం - రామ్ గణపతి.