Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం '18 పేజిస్'. నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీవాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా
ఈనెల 23న ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్బంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. 'డైరెక్టర్ సూర్య ప్రతాప్ ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించి, వెంటనే గ్రీన్‌సిగల్ ఇచ్చాను. ఈ సినిమాకు 'కార్తికేయ2' సినిమా చేయకముందే సైన్ చేశాను. నిఖిల్‌తో ఈ రెండు సినిమాలతో జర్నీ చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కూడా 'కార్తికేయ2' సినిమాలాగే అందరికీ నచ్చుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన లవ్ స్టోరీస్‌లో ఇది ఫేవరేట్ మూవీ. ఇందులో నేను పోషించిన నందిని క్యారెక్టర్ చాలా టిఫికల్గా ఉంటుంది. దీని గురించి ఎక్కువ చెప్పలేను. అది సినిమాచూస్తే మీకే తెలుస్తుంది. ఈ క్యారెక్టర్ నా మనసుకు చాలా దగ్గరనిపించింది ఏదైతే సుకుమార్ బ్రెయిన్ చైల్డ్ నుండి క్యారెక్టర్ పుట్టిందో దాన్ని తీర్చి దిద్దేటప్పుడు డైరెక్టర్ ప్రతాప్ అనుకున్న ప్రకారం తను ఏం చెపితే అది చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. సుకుమార్ 'రంగస్థలం' సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయినపుడు చాలా బాధ పడ్డాను. అల్లు అరవింద్ గారిని ఎప్పుడు కలిసినా నన్ను ఒక కూతురులా చాలా బాగా చూసుకుంటారు. ఈ సినిమా తరువాత రైటర్ లక్ష్మీ భూపాల్ ప్రొడక్షన్లో 'మరీచిక', జయం రవి గారితో 'సైరన్', అలాగే రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్లో 'ఈగల్' చిత్రంలో నటిస్తున్నాను' అని అనుపమ చెప్పారు.