Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, ఫిల్మ్ క్రిటిక్స్ ఛాయిస్ వంటి తదితర ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా 95వ ఆస్కార్ అవార్డుల్లో కూడా సత్తా చాటేందుకు తొలి అడుగు వేసింది.
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సినిమాలోని 'నాటు నాటు..' పాట షార్ట్ లిస్ట్‌లో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డుల నామినేషన్స్‌లో పోటీ పడనున్న చిత్రాల షార్ట్‌లిస్ట్‌ను అకాడమీ అవార్డుల జ్యూరీ గురువారం ప్రకటించింది. సుమారు 10 విభాగాలకు సంబంధించిన ఈ జాబితాలో 4 విభాగాల్లో భారతీయ చిత్రాలు స్థానాన్ని దక్కించుకున్నాయి. ఉత్తమ విదేశీ సినిమా విభాగం కోసం మన దేశం నుంచి ఎంపికైన 'లాస్ట్ ఫిల్మ్ షో' ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో చోటు సొంతం చేసుకోగా, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో 'ఆల్ దట్ బ్రీత్స్', ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో 'ది ఎలిఫెంట్ విష్పరర్' కూడా నామినేషన్స్ కోసం పోటీలో ఉన్నాయి. షార్ట్ లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఓ ఓటింగ్ ఆధారంగా చేసుకుని జనవరి 24న ఆస్కార్ నామినేషన్లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. మార్చి 12న విజేతలకు ఆస్కార్ అవార్డులను అందించనున్నారు.