Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యం రాజేష్, రిహ, సునీత హీరో, హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభ మైంది. ఈ కార్యక్రమానికి బిసి.వెల్ఫేర్, సివిల్ సప్లయిస్ మినిస్టర్ గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి స్టార్ట్ అయ్యింది. సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, మధు నందన్, చమ్మక్ చంద్ర తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా, భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్‌గా ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. మంచి కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుంది. త్వరలోనే ఈ చిత్ర టైటిల్‌ని మేకర్స్ ప్రకటించనున్నారు.