Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే, చాణక్య ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం 'మణిశంకర్'. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్యతల్ని జి.వి.కె(జి. వెంకట్ కష్టణ్) నిర్వహించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్.శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం.ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రయూనిట్ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మురళీ మోహన్, నిర్మాత సి.కళ్యాణ్, అశోక్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఈ చిత్ర బిగ్ ఆడియో సీడీని వీఐపీ ప్రైమ్ సీఈవో సతీష్ రెడ్డి ఆవిష్కరించారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ, 'మేం అంతా రియల్ ఎస్టేట్‌లో భాగస్వాములం. శంకర్ తీసిన ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. శివ కంఠమనేని హీరోగా, నిర్మాతగా వస్తుండటం గర్వంగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే డబ్బు చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని తెలుస్తోంది' అని తెలిపారు.
'ఈ సినిమా మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్ సాయంతో సినిమాను నిర్మించాను. దర్శకుడు జీవీకే మంచి విజన్‌తో చిత్రాన్ని రూపొందించారు. ఇళయరాజా శిష్యుడు ఎంఎల్రాజా మా సినిమాకు మంచి సంగీతం అందించాడు. మా డీఓపీ జేపీ ఎంతో సహకరించారు. నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారు' అని హీరో శివ కంఠమనేని అన్నారు. డైరెక్టర్ జి.వెంకట్ కష్టణ్ మాట్లాడుతూ, 'శంకర్‌గారు కథ విన్న వెంటనే సోల్ పట్టేసుకున్నారు. సంజన పోషించిన పాత్రలోనూ చాలా డైమన్షన్స్ ఉన్నారు.. ప్రియా హెగ్దే, చాణక్యలు పోషించిన పాత్రలు కూడా బాగుంటాయి. జనవరి మొదటి వారంలో సినిమా విడుదలకి ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు.
'శివ కంఠమనేనికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. చక్కగా నటించారు. మా నిర్మాతలు చాలా చక్కటి ప్లానింగ్‌తో సినిమాను నిర్మించారు' అని నాయిక సంజన గల్రానీ అన్నారు.