Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యావత్ భారత సినీ పరిశ్రమ గర్వించదగిన గొప్పనటుడు కైకాల సత్యనారాయణ. ఆయన మృతిపట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కైకాల తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. ఆయనతో కలిసి నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. గొప్ప స్పాంటేనియిటీ ఉన్న అరుదైన నటులు ఆయన. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్చమైన స్ఫటికం లాంటి మనిషి, నిష్కల్మషమైన మనసున్న మనిషి. నన్ను ''తమ్ముడూ'' అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు.
- చిరంజీవి
ఆరు దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో ఆయనకు మంచి స్నేహ సంబంధాలున్నాయి.
- బాలకృష్ణ
చిత్రీకరణ సమయంలో కలిసినా, పక్క సెట్లో ఉన్నా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. జూనియర్స్ ఆయనను ఏకవచనంతో పిలిచిన ఏ మాత్రం నొచ్చుకోని నిగర్వి. ఆయన మతి తెలుగు చిత్ర పరిశ్రమకు లోటు.
- పవన్‌కళ్యాణ్
కౖౖెకాలతో మరణం ఎంతో బాధాకరం. ఆయనతో కలిసి పని చేయడం వల్ల ఆయనతో నాకు చాలా మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.
- మహేష్‌బాబు
మన చిత్ర పరిశ్రమకు కైకాల చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
- రామ్‌చరణ్
తన అద్భుతమైన నటనా ప్రతిభతో చిరంజీవులుగా నిలిచారు కైకాల.
- ఎన్టీఆర్
కైకాల నటించని పాత్రలు లేవు. భావోద్వేగ పాత్రల్లో నటిస్తే కన్నీళ్లు తెప్పించేవారు. ఏనాడూ వివాదాల జోలికి వెళ్లకుండా అందరితో స్నేహంగా ఉండేవారు. ఆయన అజాత శత్రువు.
- కె.రాఘవేంద్రరావు