Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్, భూమిక హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతోంది. సజ్జా కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని గోల్డెన్ సినీ క్రియషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా సి.హెచ్ సుజాత నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని గోల్డెన్ టెంపుల్లో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు శోభన్ బాబు క్లాప్ కొట్టగా, నిర్మాత సునీత కెమెరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ నిర్మాత రామరాజు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత సుజాత మాట్లాడుతూ,'దర్శకుడు కుమార్ చెప్పిన కథ అద్భుతంగా ఉంది. ఓ మంచి కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం' అని తెలిపారు. 'నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సుజాత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శోభన్ బాబు, విలయిల్ పిలిప్స్ థామస్ చాల్కి నా ప్రత్యేక కతజ్ఞతలు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా మంచి సినిమా చేస్తాను' అని డైరెక్టర్ కుమార్ చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ,'ఇదొక మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం, పేరుపాలెం బీచ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. జనవరి నుండి షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: జె.యన్.నాయుడు, కెమెరా: వాసు వర్మ, సంగీతం: రాజేష్ రాజ్.