Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ధమాకా'. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మీడియాతో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ధమాకాకి ఫస్ట్ డే గ్రాండ్‌గా ఓపెనింగ్స్ వచ్చాయి. అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. దర్శకుడు త్రినాథరావు, రచయిత ప్రసన్న చెప్పిన కథకి రవితేజ బాగుంటారని అనుకున్నాం. ఆయనకీ బాగా నచ్చింది. దీంతో మా పీపుల్స్ మీడియాలో 'వెంకీమామ' తర్వాత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. ముఖ్యంగా ఇందులోని పాటల కోసం భారీ సెట్స్ వేశాం. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. రవితేజ, శ్రీలీల డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటికి థియేటర్లలో ప్రేక్షకుల రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. బీ సీ సెంటర్ల రెస్పాన్స్‌ను మేం ముందే ఊహించాం. అయితే మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుండి మేము ఊహించిన దానికంటే ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుండి కూడా రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా బ్యానర్లో సినిమాలతో పాటు ఓటీటీకి చాలా కంటెంట్ డెలివర్ చేస్తున్నాం. ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్‌ని ఓటీటీ వేదికగా విడుదల చేశాం. ప్రొడక్షన్లో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం మా బ్యానర్లో నాగశౌర్య- శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్లో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి', గోపీచంద్ - శ్రీవాస్ కాంబినేషన్లో 'రామబాణం'., అలాగే లావణ్య త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్ ఉంది. వీటితోపాటు మరికొన్ని పెద్ద చిత్రాలు ఉన్నాయి. వాటిని తర్వలోనే ప్రకటిస్తాం' అని అన్నారు.