Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ చిత్రంలోని మూడవ పాట 'మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి..'ను మేకర్స్ సంధ్య 35 ఎం.ఎంలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. భారీగా హాజరైన బాలయ్య అభిమానులతోనే పాటని విడుదల చేయించటం విశేషం.
తమన్ తన ట్రేడ్ మార్క్ బీట్లతో పాటని లైవ్లీగా స్కోర్ చేశాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాహితీ చాగంటి, యామిని, రేణు కుమార్ అద్భుతంగా అలపించారు. బాలకృష్ణ, చంద్రిక రవి తమ సూపర్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా బాలకృష్ణ మాస్ డ్యాన్స్ మూవ్స్‌తో మెస్మరైజ్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరించిన ఈ పాట కన్నుల పండగలా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది.
సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ,' జనవరి 12 నుండి థియేటర్లో జై బాలయ్య అనే నినాదం మోగుతూనే ఉంది. ఇప్పుడు చూసిన సాంగ్ జస్ట్ శాంపిల్ మాత్రమే. థియేటర్లో ఎవరూ సీట్లలో కూర్చోరు. భీభత్సంగా ఉంటుంది' అని తెలిపారు.
''సమరసింహారెడ్డి, నరసింహానాయుడు' రెండు కలిపితే ఎలా ఉంటుందో అదే వీరసింహారెడ్డి' అని నిర్మాత వై.రవిశంకర్ చెప్పారు.