Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రితి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా ఎస్. కిరణ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'జాన్ సే'. కథ, స్క్రీన్ ప్లే కూడా కిరణ్ కుమార్ అందిస్తున్నారు. యువ జంట అంకిత్, తన్వి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తున్న అంకిత్ ఇంతకముందు 'జోహార్, తిమ్మరుసు' వంటి చిత్రాల్లో నటించగా, హీరోయిన్ తన్వి ఐరావతం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.
'జాన్ సే...' టైటిల్లో ఉన్న మూడు డాట్స్ సినిమాలో కీలకమైన ముగ్గురి పాత్రలను ప్రతిబింబిస్తున్నాయి. అందులో మొదటి డాట్ పాత్రను క్రిస్మస్ పర్వదినాన మేకర్స్ పరిచయం చేశారు. హీరో అంకిత్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రణరు పాత్రలో కనిపించే అంకిత్ ఈ చిత్రంలో లవర్ బారు పాత్రలో కనిపిస్తారు. ఉత్కంఠ రేపే థ్రిల్లింగ్ అంశాలతో ఈచిత్రం ఆద్యంతం ప్రేక్షకులను అలరించేలా సాగుతుంది. ఈ చిత్రం తప్పకుండా థియేటర్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు కిరణ్ కుమార్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సచిన్ కమల్ సంగీతాన్ని అందిస్తున్నారు. జనవరి మొదటి వారంలో ఫస్ట్ సాంగ్‌ను సిల్లీ మాంక్స్ ఆడియో ద్వారా విడుదల చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసి సమ్మర్ స్పెషల్‌గా అయిదు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.