Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బటర్ ఫై'్ల. ఈ సినిమాలో భూమికా చావ్లా, రావు రమేష్, నిహాల్ కోధాటి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జెన్ నెక్ట్ మూవీస్ పతాకంపై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఘంటా సతీష్ బాబు దర్శకుడు.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 29న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కాబోతోంది. అనుపమా కెరీర్లో ఓటీటీలో విడుదలవుతున్న తొలి చిత్రం కావడం విశేషం. ఇందులో అనుపమ ఓ పాటను కూడా పాడారు. ఆదివారం చిత్ర బృందం మీడియాతో నిర్వహించిన సమావేశంలో నాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో నేను గీత అనే పాత్రలో కనిపిస్తాను. ఈ క్యారెక్టర్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. నేను నటించిన 'కార్తికేయ 2', '18 పేజెస్' హిట్ అయ్యాయి. సకుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను చూసి హిట్ చేస్తారని ఆశిస్తున్నా' అని చెప్పారు. 'అనుపమ లేకుంటే ఈ సినిమా లేదు. ఆమె ప్రాజెక్ట్‌లో బాగా ఇన్వాల్వ్ అయి మాకు సపోర్ట్ చేశారు. నా తోటి నిర్మాతలైన రవిప్రకాష్, ప్రదీప్‌కి థ్యాంక్స్. టెక్నికల్ టీమ్ అంతా చాలా కష్టపడి మూవీ బాగా వచ్చేలా పనిచేశారు' అని నిర్మాత ప్రసాద్ తిరువళ్లూరి అన్నారు. దర్శకుడు ఘంటా సతీష్ బాబు మాట్లాడుతూ, 'అనుపమకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా ప్రొడ్యూసర్స్ మూవీ అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చేందుకు సహకరించారు. పాటలు బాగా వచ్చాయి. ఆదిత్య మ్యూజిక్‌లో పాటలు ట్రెండ్ అవుతున్నాయి' అని తెలిపారు. 'ఇది ఒక వండర్ ఫుల్ మూవీ. ఈ సినిమాలో విశ్వ అనే రోల్ నాకు దక్కినందుకు సంతోషంగా ఉంది. అనుపమతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది' అని హీరో నిహాల్ చెప్పారు.