Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు సందీప్ కిషన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్'. ఈ చిత్రాన్ని రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ 'మైఖేల్' ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఫస్ట్ సింగిల్ 'నువ్వుంటే చాలు' ఈనెల 28న విడుదల కానుంది.
పోస్టర్లో సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ రొమాంటిక్‌గా చూడముచ్చటైన కెమిస్ట్రీతో ఆకట్టుకుంటున్నారు. సామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ పాటను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్లో సందీప్ కిషన్ తన అద్భుతమైన నటనతో అలరించారు. ఈ సినిమాలోని పాత్ర కోసం ఆయన మేకోవర్ అయిన విధానం సూపర్‌గా ఉందనే ప్రశంసలు సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్‌గా నటిస్తుండగా, విజరు సేతుపతి, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. ఈ చిత్రానికి డీవోపీ: కిరణ్ కౌశిక్, డైలాగ్స్: త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ : కె. సాంబశివరావు.