Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'రాజయోగం'.
ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్‌రావు నిర్మిస్తున్నారు. రామ్ గణపతి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 30వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గణపతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, 'తొలి ప్రయత్నంగా 'ఇఈ' (ఇతడు ఈమె ) అనే సినిమా తీశాను. రెండో సినిమాగా యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసే కమర్షియల్ సినిమాని మంచి రొమాంటిక్ యూత్ ఫుల్ సబ్జెక్ట్‌తో తీశాం. ఇది క్రైమ్ కామెడీ అని కూడా అనుకోవచ్చు. సినిమాలో వచ్చే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే బ్యాంగ్, క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్, టర్న్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇందులోని క్యారెక్టర్స్ ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఊహించని విధమైన ట్విస్ట్స్, టర్న్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఇందులో డ్రైవర్‌గా పని చేసే హీరో ఒక స్టార్ హోటల్లో నాలుగు రోజులు ఉండే పరిస్థితి వస్తుంది. అక్కడే తనకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ నాలుగు రోజుల్లో వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే 'రాజయోగం' అంటే ఒక వజ్రం కోసం జరిగే వేట. ఆ వజ్రం ఎవరికీ దొరికింది?, ఆ రాజయోగం ఎవరిని వరించింది అనేదే ఈ సినిమా కథ. సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చడమే కాకుండా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి నెక్స్ట్ షోకి టికెట్ బుక్ చేసుకోమని చెప్పే విధంగా మా సినిమా ఉంటుంది. ఈ సినిమా ప్రీమియర్ చూసిన చాలా మంది బాగుందన్నారు. ఇందులో హీరోగా నటించిన సాయి రోనక్ చాలా బాగా నటించాడు. మ్యూజిక్ డైరెక్టర్ అరుణ మురళీధరన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. హీరోయిన్లు అంకిత సాహా, బిస్మి నాస్ చాలా చక్కగా నటించారు. ఇందులో రొమాన్స్, ముద్దు సీన్లు ఎక్కువగా ఉన్నా కూడా అశ్లీలంగా ఉండదు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.