Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ కృష్ణ ఫిల్మ్స్ బ్యానర్ పై శేషుదేవరావ్ మలిశెట్టి నిర్మాణంలో శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నువ్వే నా ప్రాణం'. కిరణ్‌రాజ్, ప్రియాహెగ్డే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, భానుచందర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈనెల 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ప్రసాద్‌ల్యాబ్స్‌లో మేకర్స్ ఘనంగా నిర్వహించారు.
నిర్మాత శేషుదేవరావ్ మల్లిశెట్టి మాట్లాడుతూ,'తొలిసారి సినిమా రంగంలో అడుగుపెట్టాం. మమ్మల్ని ఆదరించి మా సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మా చిత్రంలో సుమన్, భానుచందర్ లాంటి లెజండ్స్ నటించారు. ఎన్నో చిత్రాల్లో నటించిన వాళ్ళ దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉంది' అని చెప్పారు.
'ఈ చిత్రంలో ఫైట్స్, సాంగ్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ప్రియాహెగ్డే చాలా బాగా నటించింది. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. శ్వేతాశర్మ చాలా అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మన్స్ ఇచ్చింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఈనెల 30న విడుదల చేస్తున్నాం' అని దర్శకుడు శ్రీకృష్ణ మల్లిశెట్టి అన్నారు.
భానుచందర్ మాట్లాడుతూ,'సివిల్ ఇంజనీర్‌కి మూవీ డైరెక్షన్‌కి ఎక్కడా కూడా కనెక్షన్ అనేది లేదు. కానీ మొదటి నుంచి కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చేశారు మల్లిశెట్టి. ఇటువంటి చిత్రాలను అందరూ ఆదరించి మూవీని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని తెలిపారు. 'స్టోరీ నచ్చి ఈ సినిమాకి ఓకే చెప్పాను. సెట్‌కి వెళ్ళగానే దర్శకుడు సీన్ నెరేట్ చేస్తున్న దాన్ని బట్టి ఎంతో అవగాహన ఉన్న దర్శకుడిలా అనిపించారు. అలాగే ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చాలా బావున్నాయి. హీరో, హీరోయిన్లు ఈ చిత్రంలో బాగా నటించారు' అని సుమన్ చెప్పారు.