Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్లో 'వాల్తేరు వీరయ్య', నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో 'వీరసింహారెడ్డి' చిత్రాలను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నాయి.
'వాల్తేరు వీరయ్య' జనవరి 13న, 'వీరసింహారెడ్డి' జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 'వాల్తేరు వీరయ్య'లోని అన్ని పాటలకు, అలాగే 'వీరసింహారెడ్డి'లోని రెండు పాటలకు (సుగుణ సుందరి, మా బావ మనోభావాలు) విజే శేఖర్ మాస్టర్. కొరియోగ్రఫీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన సోమవారం ఈ రెండు చిత్రాల్లోని పాటల గురించి మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'చిరంజీవి, బాలకృష్ణ లాంటి ఇద్దరు పెద్ద స్టార్స్ సినిమాలకి పని చేయడం సవాల్‌గా అనిపించలేదు. ఎందుకంటే ఈ సినిమాల్లో పాటలు చేస్తున్నప్పుడు పండక్కి వస్తాయని తెలీదు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేశాను. ఇప్పుడు రెండు సినిమాల పాటలు, లిరికల్ వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతుండటంతో టెన్షన్ వచ్చేస్తోంది(నవ్వుతూ). కానీ చాలా ఆనందంగా ఉంది. అన్నింటికిమించి సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోలు ఒకేసారి వస్తున్నారు. నాకైతే ఇది ఇంకా పెద్ద పండగ. 'వాల్తేరు వీరయ్య'లో అన్ని పాటలు చేశాను. 'వీరసింహా రెడ్డి'లో రెండు పాటలు చేశాను. పెద్ద హీరోలతో పని చేస్తున్నప్పుడు మొదట పాటకి ఏం కావోలో దాని ప్రకారం వెళ్తాం. తర్వాత హీరో బాడీ లాంగ్వేజ్‌కి ఎలాంటి స్టెప్స్, మూమెంట్స్ అయితే బావుంటాయో అనేది మౌల్డ్ చేసుకుంటూ వెళ్తాం. అంతే..ఇంతకు మించి ఎక్కువ ఆలోచించినా సరిగ్గా ఫోకస్ చేయలేం. అయితే చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరిలో ఉన్న యూనిక్ క్యాలిటీ డెడికేషన్. ఒక మూమెంట్ వస్తే అది పూర్తయ్యేవరకూ రిలాక్స్ అవ్వరు. ఆ డెడికేషన్ ఇద్దరిలో చూశా. అలాగే టైమింగ్ సెన్స్. వారిద్దరి దగ్గర నుండి నేర్చుకోవాల్సిన విషయాలివి. ఈ మధ్య కాలంలో మైత్రీ మూవీ మేకర్స్‌లో చాలా పాటలు చేశాను. వారితో పని చేయడంలో ఒక కంఫర్ట్ ఉంటుంది. మాకు ఏది కావాలన్నా సమకూరుస్తారు. ఎక్కడా రాజీపడరు. అద్భుతమైన నిర్మాతలు. ప్రస్తుతం మహేష్ - త్రివిక్రమ్ సినిమా, అలాగే రవితేజ 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వర్ రావు' సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నాను' అని శేఖర్ మాస్టర్ చెప్పారు.