Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'ఎస్ 5 నో ఎగ్జిట్'. భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి) దర్శకుడు. శౌరీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు భరత్ కోమలపాటి మాట్లాడుతూ, 'హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే ఒక ట్రైన్లో ఒక కోచ్ మొత్తం మంటలు అంటుకుంటాయి. ఆ ఒక్క బోగికే ఎందుకు అగ్నిప్రమాదం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కథనం ఊహకి అందదు. ఇందులో పొలిటికల్ డ్రామా కూడా ఉంది. సినిమా ప్రారంభానికి ముందు యానిమేటెడ్ సాంగ్‌లో కథను పరిచయం చేశాక సినిమా మొదలవుతుంది' అని తెలిపారు.
నిర్మాత గౌతమ్ కొండెపూడి మాట్లాడుతూ, 'సాయికుమార్, అలీ, సునీల్ వంటి మంచి ప్యాడింగ్తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. అందుకే ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్లు కాంపిటీషన్‌కు వచ్చినా సాగా ఎంటర్టైన్మెంట్స్వారు భారీ అమౌంట్ ఇచ్చి రిలీజ్ చేస్తున్నారంటే సినిమా మీద ఎంత నమ్మకమో మీరు అర్ధం చేసుకోవచ్చు. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గరుడ వేగ అంజి విజువల్ ట్రీట్ మా సినిమాకు పెద్ద బలం. దాదాపు 200 పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం' అని చెప్పారు.