Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇటీవల థర్డ్ సింగిల్‌గా విడుదలైన 'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి' పాట సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా అందరినీ అలరిస్తోంది. ఈ పాటలో బాలకృష్ణ సరసన సందడి చేసింది చంద్రిక రవి. ఆమె డ్యాన్స్ మూమెంట్స్ మాస్‌ని మెస్మరైజ్ చేస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ఆమె ఈ చిత్ర విశేషాలని మీడియాతో షేర్ చేసుకున్నారు.
'నా కెరీర్లో ఇంత త్వరగా, ఇంత పెద్ద అవకాశం వస్తుందని అనుకోలేదు. బాలకృష్ణ సినిమాలో అవకాశం రావడంతో నా కల నెరవేరినట్లైంది. ఆయనతో డాన్స్ చేసిన 'మా బావ మనోభావాలు పాట..' విడుదలైన గంటల్లోనే 10 మిలియన్స్ వ్యూస్‌ని క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఈ పాట నా జీవితాన్ని గొప్పగా మార్చింది. ఇదంతా ఆయన వలనే సాధ్యమైంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, డ్యాన్స్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. ఈ పాటలో హనీ రోజ్ కూడా వున్నారు. ఆమెతో కలసి పని చేయడం చాలా ఎంజారు చేశాను. ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాలు చేస్తున్నా. అలాగే ఒక తెలుగు సినిమా చర్చల దశలో
ఉంది. యుఎస్‌లో కొన్ని షోలు ప్లానింగ్‌లో ఉన్నాయి' అని చంద్రిక రవి తెలిపారు.