Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిఎమ్‌బి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.మోహన శివకుమార్ సమర్పణలో సి.సుబ్రహ్మణ్యం నిర్మించిన చిత్రం 'హెబ్బులి'. ఎస్.కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కిచ్చసుదీప్, అమలాపాల్ నటించిన ఈ చిత్రం కన్నడలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. అలాగే ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా మంచి విజయం సాధించింది.
ప్రస్తుతం తెలుగులో డబ్బింగ్, సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి, విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
వి.రవిచంద్రన్, పి.రవిశంకర్, కబీర్ దుహన్ సింగ్, రవి కిషన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో శంకర్, రవి కిషన్, సంపత్ రాజ్ నెగిటివ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఎ.కరుణాకర్ సినిమాటోగ్రఫీ అందించారు. సౌండ్‌ట్రాక్, ఫిల్మ్ స్కోర్‌ను అర్జున్ జన్య స్వరపరిచారు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ యాంగిల్‌తో కూడిన మంచి కమర్షియల్ ఓరియంటేషన్ కంటెంట్ ఉంది. కన్నడలో విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు సాధించిన పక్కా కమర్షియల్ మూవీ. తెలుగులోనూ అదే స్థాయి విజయాన్ని, వసూళ్ళని రాబడుతుందనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు.