Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ రవి హీరోగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మించిన సినిమా 'కొరమీను'.
స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది క్యాప్షన్. శ్రీపతి కర్రి దర్శకుడు. పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 31న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు ఏసిన చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత సమన్య రెడ్డి మాట్లాడుతూ, 'సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.'ఒక డైరెక్టర్లా కాకుండా.. నేను ఓ ప్రేక్షకుడిలా చెబుతున్నా. రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే టైమ్‌లో ప్రేక్షకులే సినిమాను ప్రమోట్ చేస్తారు' అని డైరెక్టర్ శ్రీపతి చెప్పారు. ఆనంద్ రవి మాట్లాడుతూ, 'మందుబాబుల దినోత్సవం నాడు మా సినిమా రాబోతోంది. సినిమాను చూసిన ఏ ఒక్కరూ నిరాశ చెందరు' అని అన్నారు. హీరోయిన్ కిషోరి మాట్లాడుతూ, 'ఇందులో మీనాక్షి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన దర్శక,నిర్మాతలకు థ్యాంక్స్' అని చెప్పారు.