Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా సినిమా 'టాప్ గేర్'. కె. శశికాంత్ దర్శకత్వంలోహొ కె.వి.శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హీరో సందీప్ కిషన్, సాయి కుమార్ ఈ చిత్ర బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.
సాయికుమార్ మాట్లాడుతూ, 'ఈ సినిమా ట్రైలర్, టీజర్ బాగుందని మెచ్చుకుంటున్నారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా మా ఆదికి బిగ్ బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నాను' అని తెలిపారు.
'ఆదికి ఈ సినిమా బిగ్ హిట్ అవ్వడమే కాకుండా ఈ సినిమాతో ఆది కేరీర్ బ్రేక్ లేకుండా సాగిపోవాలి' అని హీరో సందీప్ కిషన్ చెప్పారు.
నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, 'ఆది, రియా లిద్దరూ చాలా బాగా నటించారు. సాయి శ్రీరామ్ అద్భుతమైన విజువల్స్ అందించారు. సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం, నేపథ్య సంగీతం హైలెట్ అవుతాయి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది' అని అన్నారు.
మా దర్శక, నిర్మాతలతోపాటు నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ బాగా సపోర్ట్ చేయటంతో సినిమా చాలా బాగా వచ్చింది. మా సినిమాను అందరూ ఆదరించి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని హీరో ఆది సాయికుమార్ తెలిపారు.