Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష జంటగా నటించిన చిత్రం 'లక్కీ లక్ష్మణ్'. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. ఈనెల 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో బిగ్ టికెట్‌ను డైరెక్టర్ అభి తండ్రి గంగిరెడ్డి ఆవిష్కరించి, సోహైల్ తండ్రి సలీమ్‌కి అందించారు.
హీరో సోహెల్ మాట్లాడుతూ, 'మా నిర్మాత హరిత ఈ సినిమాను ఓన్‌గా రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ అభి ఎంతో కష్టపడ్డారు. ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. ఇంత మంచి చిత్రంతో నేను హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది' అని తెలిపారు.
'టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ చూశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మంచి సినిమా చూశామని ఫీల్ అవుతారు' అని డైరెక్టర్ అభి అన్నారు.
నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ, 'అభిని దర్శకుడిగా పరిచయం చేయటం కోసం ఈ సినిమాని తీశాను. అందుకే మా ప్రతీ చెమట చుక్కని డబ్బుగా మార్చి ఈ సినిమాను తీశాం. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా ఇది మాకు చాలా పెద్ద సినిమా. కంటెంట్ ఉన్న మూవీస్‌ను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. ఇదంతా కూడా మా టీం వల్లే సాధ్యమైంది. ఈ సినిమాలో డైరెక్టర్ రైటింగ్ అద్భుతంగా ఉంది. సోహెల్ పక్కా హీరో పీస్. మేం చేసిన పనిని గుర్తించండి' అని అన్నారు.