Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. చిరంజీవి సరసన శతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్లో గ్రాండ్‌గా జరిగిన ప్రెస్మీట్లో చిరంజీవి మాట్లాడుతూ, 'ఈ సినిమాని అందరూ ప్రేమతో చేశారు. ఆ ప్రేమ ప్రతి ఫ్రేమ్‌లో ప్రతిబింబిస్తుంది. దర్శకుడు బాబీ కథ చెప్పినపుడు, వినగానే నచ్చింది. ఇందులో కంటెంట్ బావుంది. ఆ రోజే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాను. అదే నమ్మకంతో మైత్రీ మూవీ మేకర్స్ ఇంత భారీ బడ్జెట్‌తో సినిమాని నిర్మించడం ఆనందంగా ఉంది. మనల్ని ఎలా చూపిస్తే బావుంటుందో అభిమానికే బాగా తెలుసు. అలాంటి అభిమాని దర్శకుడు బాబీ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పుడే సినిమా చూశాను. చాలా గొప్పగా అందంగా చూపించాడు బాబీ. ఈ సినిమాపై ఎన్ని అంచనాలు పెంచుకున్నా దానికి మించే ఉంటుంది' అని తెలిపారు.
'చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. అన్నయ్యతో సినిమా చేసినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ వేరుగా ఉంటుంది. వాల్తేరు వీరయ్య ఓ పండగలా ఉంటుంది' అని హీరో రవితేజ చెప్పారు. దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ,'చిరంజీవి, రవితేజలాంటి ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్‌ని ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్‌కి కతజ్ఞతలు. 'వాల్తేరు వీరయ్య' మాస్ జాతర. పూనకాలు లోడింగ్ హైప్ కోసం పెట్టింది కాదు. మనకు ఎన్నో సార్లు పూనకాలు ఇచ్చిన అన్నయ్యకి తిరిగి చిరు కానుకగా ఇస్తున్న సినిమా ఇది' అని చెప్పారు.
జీవితంలో ఇదో గొప్ప అవకాశం. చిరంజీవి గారు వేదికపై ఉండగా మాట్లాడే అవకాశం రావడం వ్యక్తిగతంగా నాకు పెద్ద విజయం. అలాగే ఈ సినిమా కోసం రవితేజ నటించినందుకు కృతజ్ఞతలు. చిరంజీవి, రవితేజ కాంబినేషన్లో కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. శ్రుతి హాసన్ ఇందులో అద్భుతంగా కనిపిస్తారు. బాస్ పార్టీ సాంగ్‌లో చేసిన ఊర్వశి రౌతేలా కూడా చక్కగా ఉంది. ఇందులో ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, నాజర్..లాంటి పెద్ద కాస్టింగ్ వుంది. బాబీ బెస్ట్ టీం సెలెక్ట్ చేసుకున్నారు. సంక్రాంతి లాంటి పండక్కి ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన గొప్ప సినిమా ఇచ్చినందుకు దర్శకుడు బాబీకి చాలా థ్యాంక్స్.
- నిర్మాత వై.రవిశంకర్