Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా '18 పేజెస్'. క్రిస్మస్ కానుకగా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పొయిటిక్ లవ్ స్టోరీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రోజురోజుకు సినిమాకు మంచి స్పందన లభిస్తున్న తరుణంలో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ,
'ఈ సినిమా వన్ వీక్ పూర్తి చేసుకుంది. కమర్షియల్ సినిమాలకే ఆడియన్స్ వస్తున్నారు అనుకునే తరుణంలో ఇది ఒక చాలా డీసెంట్ కథ, ఒక ఎమోషన్ ఉన్న కథ, మెయిన్ రైటింగ్‌తో ముడిపడిన కథ ఇది. ఈ సినిమా మౌత్ టాక్‌తో డే బై డే పెరుగుతూ వెళ్ళింది' అని తెలిపారు. 'ఈ సినిమాను అరవింద్, బన్నీవాసు చెప్పినప్పుడు వాళ్ళు ఏమి ఫీల్ అయ్యారో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మాకు మేమే ప్రేమలో పడిన ఫీల్ వస్తుందండి అంటున్నారు. అది మాకు పెద్ద ప్రశంస. ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది' అని దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి అన్నారు. అనుపమ మాట్లాడుతూ, 'ఈ సినిమాకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నాకు సంతృప్తినిచ్చింది. ఒక యాక్టర్‌గా చాలా మంచి సినిమా చేసిన ఫీల్ వచ్చింది' అని చెప్పారు. ''సీతారామం' సినిమా క్లైమాక్స్‌కి ఉన్న ఫీలింగ్ ఈ సినిమాకి వచ్చిందని చాలామంది పోల్చి చెబుతున్నారు' అని అల్లు అరవింద్ తెలిపారు.
నిఖిల్ మాట్లాడుతూ,'ఈ సినిమా ఒక స్లో పాయిజన్. 2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్‌లో ఈ సినిమా ఉంటుంది. కెరీర్ వైజ్‌గా నాకు నా జీవితంలో ఇది బెస్ట్ ఇయర్.