Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై అశ్విన్ బాబు, పాలక్ లల్వాని, నాజర్, కాంతారా ఫేమ్ అచ్యుత్, ఆర్.జె.హేమంత్, సంజ జనక్, మాధవి నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'వచ్చిన వాడు గౌతమ్'.
ఎం.ఆర్.కృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ డిఎస్ఆర్ నిర్మిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత దామోదర ప్రసాద్ హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, నిర్మాత బెల్లంకొండ సురేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నటుడు, నిర్మాత డి.యస్ రావ్ మాట్లాడుతూ,'దర్శకుడు ఎం.ఆర్. కృష్ణ చెప్పిన మెడికో థ్రిల్లర్ కథ హీరో అశ్విన్ బాబుకు, నాకు కూడా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. కంటెంట్ బాగుంటేనే సినిమాలు ఆడతాయి అని సురేష్‌బాబు చెప్పడంతో ఈ కథను సురేష్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్లో చెప్పించి, అందర్నీ ఒప్పించి వారి బ్లెస్సింగ్స్‌తో ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాను. హీరో అశ్విన్ బాబును దర్శకుడు కొత్త కోణంలో చూపించబోతున్నారు. పెద్ద పెద్ద సినిమాలు చేసిన టెక్నిషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రానికి 'వచ్చిన వాడు గౌతమ్' అనే టైటిల్ పెట్టాం. జనవరి నుండి రెగ్యులర్ షూట్ మెదలు పెట్టి వైజాగ్, హైదరాబాద్‌ల్లో రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్ కంప్లీట్ చేస్తాం. నటీనటులు, టెక్నీషియన్ల అందరి సహకారంతో మేలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. త్వరలో ఒక యూత్ హీరోతో మరొక సినిమా చేస్తున్నాను. మంచి కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని చెప్పారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ఎం. ఆర్. కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ తోట - గిరిధర్, సహ నిర్మాతలు : చందు, వెంకట్, డి.ఓ.పి : శ్యాం కె. నాయుడు, ఫైట్ మాస్టర్స్ : రామ్ లక్ష్మణ్, సంగీతం : హరి గౌర, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ : రఘు కులకర్ణి, మూల కధ : పద్మా నల్లంట్ల, మాటలు : నాదెళ్ళ కృష్ణ చైతన్య - శ్రీ పద్మా నరహరి - రవి వర్మ రొడ్డ.