Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ 'ధమాకా'. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి టిజి విశ్వ ప్రసాద్ నిర్మాత. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మాసీవ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా మాస్ మీట్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించింది.
రవితేజ మాట్లాడుతూ,'ఈ సినిమాకి పని చేసిన అందరికీ కంగ్రాట్స్. ఈ సినిమా విజయానికి మొట్టమొదటి కారణం.. మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో. సాలిడ్ సౌండ్ ఇచ్చాడు. ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్‌కి వెళ్తాడు. ఈ సినిమా సక్సెస్‌కి రెండో కారణం .. పీపుల్స్ మీడియా మీడియా ఫ్యాక్టరీ. వాళ్ళు ప్రమోట్ చేసిన విధానం, వారి పాజిటివిటీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. విశ్వప్రసాద్, వివేక్ అద్భుతమైన వ్యక్తులు. చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఈ సినిమాకి మరో ఆకర్షణ మా అందమైన హీరోయిన్ శ్రీలీల. అందం, ప్రతిభ, అభినయం అన్నీ ఉన్నాయి. ఇక డ్యాన్స్‌లో సూపర్. ఇండియన్ ఫిల్మ్ ఇండిస్టీలోనే తను పెద్ద స్టార్ కాబోతుంది. ఈ విజయానికి మరో కారణం డైలాగ్ రైటర్ ప్రసన్న కుమార్. డైలాగులు అద్భుతంగా ఎంజారు చేస్తున్నారు. ఈ సినిమాకి డ్రైవర్ దర్శకుడు త్రినాథరావు, నేను కండక్టర్ని(నవ్వుతూ)' అని చెప్పారు. 'ధమాకా విజయం సమిష్టి కృషి. ఎంతో మంది కష్టపడితే ఈ రోజు ధమాకా సక్సెస్‌ని ఎంజారు చేస్తున్నాం. ఇంతమంది పని చేయాలంటే ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి పేరు.. రవితేజ. ధమాకా ఒక్కరి విజయం కాదు .. మన అందరి విజయం. ఈ విజయాన్ని రవితేజ ఫ్యాన్స్ అందరికీ అంకితం చేస్తున్నాను' అని దర్శకుడు త్రినాథరావు నక్కిన అన్నారు.
నాయిక శ్రీలీల మాట్లాడుతూ,'ప్రేక్షకులు, అభిమానులే ధమాకా టైటిల్‌కి న్యాయం చేయగలరని ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్పాను. అలాగే మీరు చేశారు. అందరికీ కృతజ్ఞతలు. ఇండిస్టీలో ఇది నా రెండో అడుగు. పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. మీ అభిమానం ఇలానే ఉండాలి. రవితేజ బంగారం. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని తెలిపారు. 'ధమాకాని మాసీవ్ బ్లాక్ బస్టర్ చేసిన రవితేజ అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రవితేజతో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని ఎదురుచూస్తున్నాం. త్రినాథరావు, ప్రసన్న, శ్రీలీల.. మా ప్రొడక్షన్ టీం.. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు' అని నిర్మాత టిజి విశ్వప్రసాద్ చెప్పారు.