Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయిరోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో, హీరోయిన్లుగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా 'రాజయోగం' . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్‌రావు నిర్మించారు. దర్శకుడు రామ్ గణపతి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ తెచ్చుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ, 'మా సినిమాకు థియేటర్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుంచి చూపు తిప్పుకోకుండా చూస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇది నా మొదటి సినిమా అయినా, అనుభవజ్ఞుడైన దర్శకుడిలా తెరకెక్కించానని అనే ప్రశంసలు వస్తున్నాయి. ఇంకా సినిమా చూడని వారు త్వరగా చూసేయండి. ఎంత మంచి సినిమా అయినా మూడు రోజులకు మించి థియేటర్లలో ఉంచడం లేదు. సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ చిత్రం చూసి నవ్వకుండా ఉండగలిగితే వాళ్ళకు లక్ష రూపాయల బహుమతి ఇస్తాం అని మా నిర్మాతలు ప్రకటించారు అంటే మాకెంత నమ్మకమో మీరు అర్థం చేసుకోండి' అని అన్నారు. 'ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మేము పడిన కష్టానికి ఫలితం దక్కిందని అనిపిస్తోంది. అయితే మంచి చిత్రానికి కూడా థియేటర్స్, షోస్ దొరకడం లేదు. ప్రేక్షకులు చూడాలని అనుకున్నా, ఆ టైమ్‌కు షోస్ ఇవ్వకుంటే ఎలా చూస్తారు?, నా లాంటి కొత్త హీరోలు, దర్శకులు ఎన్నో ఆశలతో ఇండిస్టీకి వచ్చాం. చేసిన మంచి సినిమాలకైనా థియేటర్ల పరంగా సపోర్ట్ దొరక్కపోతే ఎలా?, మా సినిమా లాంటి మంచి చిత్రాలను ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా. మంచి సినిమాలో నటించానని హ్యాపీగా ఉంది' అని హీరో సాయి రోనక్ తెలిపారు.