Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఎన్బికె 108 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వేసిన భారీ జైలు సెట్లో మాసీవ్ యాక్షన్ సీక్వెన్స్‌తో తాజాగా టీమ్ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కి వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ షెడ్యూల్లో బాలకృష్ణ, శరత్ కుమార్‌తో పాటు మరికొంతమంది ఆర్టిస్ట్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సెట్లోనే ఎన్బికె 108 యూనిట్ నూతన సంవత్సర వేడుకలని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడూ పోషించని పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్ యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. బాలకష్ణ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు అనిల్ రావిపూడి ఓ పవర్ఫుల్ కథను రాశారు.
ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా. తమ్మి రాజు ఎడిటర్‌గా, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. యాక్షన్ పార్ట్‌కి వి.వెంకట్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ, డీవోపీ: సి రామ్ ప్రసాద్,ఎడిటర్: తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్, ఫైట్స్: వి.వెంకట్.