Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'వీరసింహారెడ్డి'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 6న ఒంగోలులో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అంతకంటే ముందు ఈ చిత్రంలోని 4వ చివరి పాట- 'మాస్ మొగుడు..' లిరికల్ వీడియో ఈనెల 3వ తేదీ సాయంత్రం 7:55 గంటలకు విడుదల కానుంది. బాలకృష్ణ, శ్రుతి హాసన్ రాకింగ్ కెమిస్ట్రీని చూపించే పోస్టర్ ద్వారా సాంగ్ డేట్‌ని ప్రకటించారు. బాలకృష్ణ ట్రెడిషనల్ వేర్లో రాయల్‌గా కనిపించగా, శ్రుతి హాసన్ ట్రెండీ డ్రెస్‌లో గ్లామర్‌గా కనిపిస్తోంది. ఈ పాట తమన్ మార్క్ మాస్ నంబర్‌గా ఉండబోతోంది. ఈ చిత్రంలో దునియా విజరు, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, సంగీతం: తమన్,
డివోపీ: రిషి పంజాబీ, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంకట్, సిఈవో: చిరంజీవి (చెర్రీ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి.