Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ కథానాయకుడిగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'వీరసింహారెడ్డి'. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన రిషి పంజాబీ విలేఖరుల సమావేశంలో ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
''వీరసింహారెడ్డి' లార్జర్ దెన్ లైఫ్ మూవీ. యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ప్రేక్షకులకు సినిమా విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది. సినిమా చూస్తున్నపుడు చాలా చోట్ల గూస్ బంప్స్ వస్తాయి. 'వీరసింహారెడ్డి' బిగ్ బ్లాస్టింగ్ ఎంటర్టైనర్. బాలకృష్ణతో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టెక్నీషియన్స్‌ని చాలా గొప్పగా అర్ధం చేసుకుంటారు. ఈ సినిమాలో రగ్గడ్ నెస్ కావాలి. దాని కోసం టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి దాన్ని ఎచీవ్ చేశాం.బాలకృష్ణ పర్సోనా లార్జర్ దెన్ లైఫ్. దాన్ని తెరపై ఎంత గొప్పగా ఆవిష్కరించాలనే దానిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. లండన్ నుండి తీసుకొచ్చిన న్యూ సెటప్ లెన్స్‌లు వాడాం. కలర్స్ అద్భుతంగా ఉంటాయి. సినిమా విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది. గోపీచంద్ మలినేని యంగ్ అండ్ డైనమిక్ వండర్ఫుల్ డైరెక్టర్. తనకి చాలా మంచి భవిష్యత్ ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవి, నవీన్ అద్భుతమైన నిర్మాతలు. వారి సపోర్ట్ మర్చిపోలేను. ఇంత గొప్ప నిర్మాతలని నేను చూడలేదు. వారికి సినిమా పట్ల గొప్ప ప్యాషన్ ఉంది' అని తెలిపారు.