Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత సావిత్రి నిర్మిస్తున్న చిత్రం 'చక్రవ్యూహం' (ది ట్రాప్ అనేది ట్యాగ్‌లైన్). ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు అజరు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకి చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు సినిమా స్థాయిని పెంచారు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు తెరపై ఆయనే తొలి కౌబారు, ఆయనే మొదటి జేమ్స్ బాండ్, ఆయనే ఫస్ట్ సినిమా స్కోప్ హీరో, ఆయనే తొలి 70 ఎం.ఎం. మూవీ డైరెక్టర్ కమ్ హీరో. చిత్రసీమలో డేరింగ్ డాషింగ్ అనే పదాలకు నిలువెత్తు నిర్వచనంగా మారి, తెలుగు చిత్రపరిశ్రమకు ఒక సరికొత్త సాంకేతికతను పరిచయం చేసిన కృష్ణ చివరగా ఈ సినిమా పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ పోస్టర్‌ను లాంచ్ చేసిన ఆయన ఈ చిత్ర బృందానికి ఆశీస్సులు అందించారు. ఈ లాంచ్ చేసిన పోస్టర్లో పోలీస్ పాత్రలో ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్న అజరును మనం గమనించవచ్చు.
ఈ సినిమా మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి రచన -దర్శకత్వం: చెట్కూరి మధుసూధన్, నిర్మాత: శ్రీమతి.సావిత్రి, సహ నిర్మాతలు: వెంకటేష్, అనూష, సంగీత దర్శకుడు: భరత్ మంచిరాజు, సినిమాటోగ్రఫీ: జివి అజరు, ఎడిటర్: జెస్విన్ ప్రభు, ఫైట్స్: రాబిన్ సుబ్బు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అజరు, మహేష్.