Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాలను రూపొందించే దర్శకుడు గుణ శేఖర్ సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తున్న అద్భుతమైన పౌరాణిక దృశ్య కావ్యం 'శాకుంతలం'. భారతీయ సినీ ప్రేక్షకులు ఈ ఏడాదిలో చూడాలనుకుని ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజువల్ వండర్‌గా 'శాకుంతలం' తనదైన ప్రత్యేకతను సంపాదించుకుంది. సమంత టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు.
ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజు అజరామరమైన ప్రేమ కథ ఇది. ఇందులో శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు.
చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా నిర్మాతలు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఎఓనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించటానికి ఈ సినిమాను త్రీడీలో రూపొందిస్తున్నారు.