Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా పరిధి ఇప్పుడు బాగా పెరిగిపోయింది. తెలుగు సినిమా.. ఇప్పుడు ఇండియన్ సినిమాగా ఎదిగింది. దీంతో పలు భాషల నటీనటులు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానం పొందాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు.
ఆ కోవలో తెలుగు సినిమాల్లో నటుడుగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాడు పంజాబీ కుర్రాడు ప్రీత్ షేర్ గిల్. పంజాబ్ యూనివర్సిటీ నుండి థియేటర్ ఆర్ట్స్‌లో ఎంఏ పట్టా పుచ్చుకున్న ప్రీత్ షేర్ గిల్ 'వార్నింగ్, ఎక్కో మీక్కే, నిడర్, ఖిడారి' అనే నాలుగు పంజాబీ సినిమాల్లో యంగ్ విలన్‌గా నటించాడు. అంతేకాక రంగస్థలం మీద 25 పంజాబీ నాటికలు, నాటకాల్లో నటించి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో జాతీయ స్థాయిలో రెండు మెడల్స్ సంపాదించిన ఈ చండీఘడ్ చిన్నోడికి కరాటేలో కూడా ప్రవేశం ఉంది. ఇలా నటనలో, ఫైట్స్‌లోనూ చక్కని శిక్షణ పొంది, తనకు లభించిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
ప్రస్తుతం 'మదర్ ల్యాండ్' అనే వెబ్ సిరీస్‌లో, ఒక హిందీ సినిమాలో నటిస్తున్న ప్రీత్ గిల్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలుగు సినిమా రంగానికి వచ్చి ప్రయత్నాలు ఆరంభించాడు.
నటనలో, ఫైట్స్‌లో శిక్షణ పొంది చక్కని రూపంతో, నిర్మాతల బడ్జెట్‌కి అందుబాటులో ఉండటంతో పలువురు దర్శక, నిర్మాతలు ప్రీత్ గిల్ కి తమ సినిమాలలో మంచి పాత్ర ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతి తర్వాత ప్రారంభమయ్యే కొన్ని సినిమాల్లో ప్రీత్ గిల్ చక్కని పాత్రలు చేయబోతున్నారు.
తెలుగు సినిమా రంగంలోని దర్శక, నిర్మాతలందరికీ తనకు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా ప్రీత్ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇచ్చిన పాత్రకు తన నటనతో పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాడు.