Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాక్ కింగ్స్ క్రియేషన్స్ పతాకంపై రోషన్, పూజ డే, అమీక్ష పవర్ హీరో, హీరోయిన్స్‌గా యం.డి.అభిద్ దర్శ కత్వంలో యం.డి.అహ్మద్ ఖాన్ నిర్మించిన చిత్రం 'మన్మధరాజా'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నగేష్, అడిషనల్ డి.యస్.పి లక్ష్మణ్ రావ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్, యస్.యం.యస్. ఇంటర్నేషనల్ డైరెక్టర్ దుబాయ్ వాజీద్, డైరెక్టర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత యం.డి.అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ,'నాకు సినిమా అంటే ఫ్యాషన్. మా అబ్బాయిని హీరోగా పెట్టి తీసిన 'ఓ మధు' సినిమా 30 రోజులు ఆడేలా చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. 'ఉత్తమవిలన్' తరువాత చేసిన ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. అలాగే నేను చేయబోయే రెండు సినిమాల్లోనూ మా అబ్బాయి హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలి' అని తెలిపారు.
'మా ట్రైలర్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇలాంటి మంచి సినిమా చేసే ఛాన్స్ ఇచ్చిన నిర్మాత యం.డి. అహ్మద్ ఖాన్‌కి కృతజ్ఞతలు' అని దర్శకుడు అభిద్ చెప్పారు.