Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, చిరంజీవి ఇమేజ్ పాట రాయడానికి ఒక ఊతమిస్తుంది.
కొన్ని మాటలు వాళ్ళ ఇమేజ్‌కే రాయగలం. చిరంజీవికి రాసిన పాట విని చాలా బావుందని అన్నారు. అలాగే మనోభావాలు పాట షూటింగ్ జరిగినప్పుడు సెట్‌కి వెళ్లాను. బాలకష్ణ కూడా బావుందని అభినందించారు. మనోభావాలు పాట విజువల్‌గా కూడా
చాలా కిక్ ఇచ్చింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా బాలకష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్లో 'వీరసింహారెడ్డి', చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్లో 'వాల్తేరు వీరయ్య' చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వీరసింహారెడ్డి' ఈనెల 12న, ఈనెల 13న 'వాల్తేరు వీరయ్య' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన 'వీరసింహారెడ్డి' చిత్రంలోని 'జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు..', 'వాల్తేరు వీరయ్య' చిత్రంలోని 'బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ ' పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 'వీరసింహారెడ్డి'లో అన్ని పాటలకు (సింగిల్ కార్డ్), 'వాల్తేరు వీరయ్య'లోని 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' పాటకు సాహిత్యం అందించారు సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి.
ఈ సందర్భంగా విలేఖరులతో ఈ రెండు చిత్రాల విశేషాలను షేర్ చేసుకున్నారు. 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ'..ఈ లిరిక్స్‌లో సౌండింగ్ సరదా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్‌తో చెప్పాను. దాని చుట్టూ ఒక కాన్సెప్ట్ అనుకొని ఒక ట్యూన్ ఇచ్చారు. పాట చాలా అద్భుతంగా వచ్చింది. సంక్రాంతి సినిమాలన్నిటికీ లిరిక్స్ రాయటం హ్యాపీగా ఉంది. 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య'లో అన్ని పాటలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకంగా ఉంటుంది.
'క్రాక్' తర్వాత గోపీచంద్‌తో మళ్ళీ కలిసి చేస్తున్నాను. 'వీరసింహారెడ్డి' సింగిల్ కార్డ్ రాశాను. తమన్‌తో కలసి అన్ని పాటలు అద్భుతంగా చేశాం. విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నాలుగో పాట కూడా అంతకు మించి ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలకి రాస్తున్నపుడు అభిమానుల అంచనాలు అందుకోవడం సవాల్‌గా ఉంటుంది. 'వీరసింహారెడ్డి'లో 'మా బావ మనోభావాలు..' పాట ఐడియా నాదే. మనోభావాలు అందరూ సమకాలీనంగా వాడే మాటే. అలాగే 'మాస్ మొగుడు పాట' మంచి ఊపుతో, క్లైమాక్స్‌కి తగ్గట్టుగా ఉంటుంది. ఈ రెండూ సినిమాలు ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌తో పాటు మంచి మ్యూజికల్ ట్రీట్ ఇస్తాయి. ఈ రెండు చిత్రాలు బూమ్ బద్దలు రికార్డ్‌లు సష్టిస్తాయి' అని రామజోగయ్యశాస్త్రి చెప్పారు.
రామజోగయ్య శాస్త్రి