Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధన్య బాలకష్ణ, చైతన్య రావు, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం 'జగమే మాయ'. సునీల్ పుప్పాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్యాపి స్టూడియోస్ బ్యానర్ పై ఉదరు కోలా, శేఖర్ అన్నే నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తెలుగు, తమిళం, హిందీ... అన్నీ భాషల ప్రేక్షకులను అలరించి టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్లో హీరో చైతన్య రావు మాట్లాడుతూ,' మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పటానికి మరో ఉదాహరణగా మా సినిమా నిలిచింది. ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు' అని తెలిపారు. 'అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తే మాకు డిసెంబర్ 15న వచ్చింది. ఈ సినిమా విజయాన్ని జీవితంలో మర్చిపోలేను. అందరి నుండి అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి' అని నాయిక తేజ ఐనంపూడి చెప్పారు.
నిర్మాత ఉదరు కోలా మాట్లాడుతూ,'తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ తమిళంలోనూ విడుదల చేశాం. అన్నీ భాషల్లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. హాట్‌స్టార్ టీంకి కతజ్ఞతలు. సునీల్ అద్భుతమైన స్క్రిప్ట్‌తో వచ్చాడు. చాలా హార్డ్ వర్క్ చేశాడు. అందరూ వండర్ ఫుల్ పెర్ ఫార్మ్ మెన్స్ చేశారు' అని అన్నారు.
'నిర్మాత ఉదరు నన్ను బలంగా నమ్మారు. ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ కతజ్ఞతలు' అని దర్శకుడు సునీల్ పుప్పాల తెలిపారు.