Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారణాసి క్రియేషన్స్ పతాకంపై చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, కేటలిన్ గౌడ ముఖ్య తారాగణంతో ముని కష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఏ జర్నీ టు కాశీ'. కె పి లోకనాథ్, దొరడ్ల బాలాజీ, శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈనెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరిపారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శకుడు శేఖర్ సూరి మాట్లాడుతూ, ''ఏ జర్నీ టు కాశీ' అనే టైటిల్ చాలా బాగుంది. కాశీతో నాకు మంచి అనుబంధం ఉంది. కాశీలో 60 రోజులు ఉన్నాను. ఈ సినిమా ట్రైలర్ చూసాను. చాలా బాగుంది, దర్శకుడి ఉద్దేశం అద్భుతంగా ఉంది. నేటి కాలంలో మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. 'శుద్ధోసి బుద్ధోసి' పాట చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి మంచి కథ తీసిన దర్శక,నిర్మాతలకి నా కృతజ్ఞతలు' అని తెలిపారు.'మా చిత్రం ఈనెల 6న విడుదల అవుతుంది. మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం. అందరు చూసి, మా చిత్రాన్ని హిట్ చేయండి' అని నిర్మాతల్లో ఒకరైన దొరడ్ల బాలాజీ చెప్పారు.
'శుద్ధోసి బుద్ధోసి' పాట పడిన సింగర్ గోమతి అయ్యర్ మాట్లాడుతూ, 'ఈ పాట పాడటానికి నాకు అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్‌కి, చిత్ర యూనిట్ సభ్యులకి నా కతజ్ఞతలు. ఈ చిత్రం మంచి హిట్ అవాలి' అని అన్నారు.
'ఈ చిత్రంలో ఒక తెలుగు పాట, ఒక సంస్కత పాట, ఒక ఇంగ్లీష్ పాట చేశాను. ఇలాంటి మంచి చిత్రంలో పని చేయటానికి గొప్పగా ఫీల్ అవుతున్నాను' అని సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ చెప్పారు.
దర్శకుడు ముని కష్ణ మాట్లాడుతూ, 'ఈ చిత్రం కాశీ యాత్రకు సంబంధించిన కథ. కాశీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక కుటుంబ కథ ఇది. ఈ చిత్రం చాలా ఎంటర్టైన్మెంట్గా, ఎమోషనల్ ఫామిలీ డ్రామా కథగా ఉంటుంది. ఈనెల 6న తెలంగాణ, ఆంధ్రలో మంచి మంచి థియేటర్స్‌లో విడుదల అవుతుంది. అందరు చూసి ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను' అని అన్నారు.