Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తున్న చిత్రం 'పాప్ కార్న్'. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
బుధవారం ఈ చిత్ర ట్రైలర్ లీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అక్కినేని నాగార్జున విచ్చేసి, ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నిర్మాతలకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. లిఫ్ట్‌లో సాంగ్ కొరియోగ్రఫీ చేసిన అజరుకి అభినందనలు. డైరెక్టర్ మురళి టెన్షన్ పడనక్కర్లేదు. సినిమా డిఫరెంట్‌గా ఉంది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. అవికా గోర్ హీరోయిన్‌గానే కాదు, నిర్మాత కూడా అయ్యింది. ఈ పాప్ కార్న్ సినిమాను పెద్ద హిట్ చేస్తారనే నమ్మకం ఉంది' అని అన్నారు.
'ఈ సినిమాకు డైరెక్టర్ ఎంత ముఖ్యమో.. అవికాగోర్ కూడా అంతే ముఖ్యం. సినిమా చివరి 45 నిమిషాలైతే అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. పెద్దవాళ్లందరూ మళ్లీ వెనక్కి వెళతారు. చిన్నవాళ్లైతే ఎంజారు చేస్తారు. ప్యూర్ లవ్ స్టోరి. అందుకే వాలెంటైన్స్ డే కంటే ముందే రిలీజ్ చేస్తున్నాం' అని చిత్ర సమర్పకుడు ఎం.ఎస్.చలపతి రాజు చెప్పారు.
చిత్ర నిర్మాత భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ, 'నాగార్జున మా 'పాప్ కార్న్' సినిమా ట్రైలర్‌ను విడుదల చేయటం నిజంగానే కిక్ ఇచ్చింది. ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం' అని అన్నారు.
'డైరెక్టర్‌గా ఇది నా తొలి చిత్రం. అవికా గోర్, సాయి రోనక్, నిర్మాతలకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్స్' అని చిత్ర దర్శకుడు మురళి గంధం తెలిపారు. నిర్మాత, హీరోయిన్ అవికా గోర్ మాట్లాడుతూ, 'నేను ఈ సినిమాకు నిర్మాతగా చేయటం రిస్క్ అని అన్నారు. రిస్క్ అయినా ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా జర్నీలో నేను చేసిన ప్రతి విషయాన్ని ఆడియెన్స్ చక్కగా రిసీవ్ చేసుకుని ఎంకరేజ్ చేశారు' అని తెలిపారు.
'సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల లోపే ఆడియెన్స్ పాప్ కార్న్ ప్రపంచంలోకి వచ్చేస్తారు. లిఫ్ట్‌లో నడిచే కథ కదా.. బోర్ అయిపోతామేమో అని అనుకున్నాను. కానీ మురళి కథను నెరేట్ చేయటం స్టార్ట్ చేయగానే ఎక్కడా బోర్ ఫీల్ కాలేదు. ఈ సినిమా క్లైమాక్స్‌ని ప్రేక్షకులు సీట్ ఎడ్జ్‌లో కూర్చొని చూస్తారు. చేసిన నాకే సినిమా చూస్తే గూజ్బమ్స్ వచ్చాయి' అని హీరో సాయి రోనక్ అన్నారు.