Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది అక్షర ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై బాబు పెదపూడి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'రివేంజ్'. నేహదేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు ఎన్.శంకర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'దర్శకుడు శ్రీను నాకు మంచి మిత్రుడు. తను మంచి రైటర్, దర్శకుడు. ఈ సినిమాతో తనలో ఉన్న మరో కోణాన్ని మనకు పరిచయం చేయబోతున్నాడు. ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్న బాబుని ఒక మంచి నటుడుగా పరిచయం చేయాలన్న ఉద్దేశంతో దర్శకుడు తనకోసం ఒక మంచి క్యారెక్టర్ని డిజైన్ చేసి ఈ కథ అల్లుకున్నాడు. ఈ సినిమా సక్సస్ సాధించాలి' అని అన్నారు.
'త్రివిక్రమ్ 'అతడు', దశరథ్ 'శ్రీ' సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. ఒక మంచి నటుడుగా నన్ను పరిచయం చేయడానికి నాకోసం దర్శకుడు శ్రీనివాస్ చాలా పాత్రలు రాశారు. తన డెడికేషన్ నచ్చి ఈ సినిమా తనకిచ్చాను. అద్భుతంగా తీశారు. ట్రైలర్ చూశాక ఇదొక సైకో కథ అనిపించవచ్చు. కానీ బర్నింగ్ పాయింట్స్‌తో తీసిన సినిమా ఇది. ప్రతి ఆడియన్ హార్ట్‌ని టచ్ చేసే కథ. మనం అమితంగా ఇష్టపడే వాళ్లకు ఏమైనా జరిగితే మనం ఎలా మారిపోతాం అనేది సినిమా. ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. త్వరలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని హీరో, నిర్మాత బాబు పెదపూడి చెప్పారు.
దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ, ''పొదరిల్లు, ఐపిసి సెక్షన్' రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను. ఇది మూడో సినిమా. హీరో, నిర్మాత బాబు ప్యాషన్ చూశాక ఒక మంచి కథ రాయాలని డిసైడ్ అయ్యాను. చాలా పాత్రలు రాశాను. చివరిగా ఈ సినిమా తీశాం. బాబు అద్భుతంగా నటించాడు. కథలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఇటీవలే మా మిత్రులకు షో వేసి చూపించాం. అందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు. సినిమా అంతా పూర్తయింది. త్వరలో రిలీజ్ చేస్తాం' అని తెలిపారు.