Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా 'కళ్యాణం కమనీయం'. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సకుటుంబంగా చూసే చిత్రంగా ఈ సినిమా మీద అంచనాలు
ఇప్పటికే భారీగా ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను అగ్ర కథానాయిక అనుష్క విడుదల చేశారు.
'శివ, శృతి ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. పెళ్లైన కొత్తలో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తారు. శివకు ఉద్యోగం లేకపోవడం శృతికి ఇబ్బందిగా మారుతుంది. భార్యను సంతోష పెట్టేందుకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు శివ. ఆ ప్రయత్నాలు ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్లాయి?, శివ ఉద్యోగం సంపాదించి శృతిని హ్యాపీగా ఉంచాడా లేదా అనేది ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. శివకు ఉద్యోగం లేకపోవడం ఈ జంట మధ్య ఎలాంటి మనస్పర్థలకు దారి తీసింది అనేది కూడా ఎమోషనల్‌గా పిక్చరైజ్ చేశారు. ఇది ప్రతి భార్య కథ, ప్రతి భర్త కథ, ఇది ప్రతి పెళ్లి కథ అంటూ వేసిన క్యాప్షన్స్ స్టోరీకి యాప్ట్‌గా అనిపించాయి. మొత్తంగా అన్ని భావోద్వేగాలు ఉన్న ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, హో ఎగిరే లిరికల్ సాంగ్స్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు ట్రైలర్ కూడా ఇంప్రెసివ్‌గా ఉండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి అని చిత్ర బృందం తెలిపింది.