Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'అమిగోస్'. డెబ్యూ డైరెక్టర్ రాజేంద్ర రెడ్డితో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'అమిగోస్' అంటే ఫ్రెండ్‌ను పిలిచే స్పానిష్ పదం. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. సిద్ధార్థ్, మంజునాథ్‌గా విడుదల చేసిన రెండు లుక్స్‌కి ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి చాలా మంచి రియాక్షన్ వచ్చింది. తాజాగా మూడో లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. కానీ ఈ పాత్రను అజ్ఞాత వ్యక్తి పాత్ర అని చెప్పారు. అసలు ఈ మూడు లుక్స్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 10న రిలీజ్ అయ్యే అమిగోస్ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక, నిర్మాతలు.
కళ్యాణ్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణం ఫైనల్ స్టేజ్‌కు చేసుకుందని, ఈనెల 8న టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు.