Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో 'వీరసింహారెడ్డి'లో మెయిన్ విలన్‌గా నటించిన ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజరు విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలను షేర్ చేసుకున్నారు.
'దర్శకుడు గోపీచంద్ ఇందులో నా పాత్ర గురించి చెప్పినప్పుడే చాలా థ్రిల్ అనిపించింది. ఈ కథలో విలన్ పాత్ర ఒక పిల్లర్‌లా ఉంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర. ఇంత మంచి పాత్రలో బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఇందులో నా లుక్ చాలా మొరటుగా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి. బాలకృష్ణ గత సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలోనూ ఫైట్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. వేరే ఎనర్జీ ఉంటుంది. ప్రేక్షకులు ఆ ఎనర్జీని థియేటర్లో ఫీలౌతారు. వీరసింహా రెడ్డి..అభిమానులకు, ప్రేక్షకులకు గ్రేట్ ఎమోషనల్ జర్నీ. ఈ సినిమా సక్సెస్ తర్వాత మంచి పాత్రలు వస్తే విలన్‌గా కంటిన్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం 'భీమా' అనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను.