Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 1 నుంచి డిస్నీ+ హాట్స్టార్
- ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలో ప్రసారం
నవతెలంగాణ హైదరాబాద్:
మార్వెల్ స్టూడియోస్ వారి ‘‘బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్’’ను ఫిబ్రవరి 1 నుంచి ప్రసారం చేస్తామని డిస్నీ+ హాట్స్టార్ ప్రకటించి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులకు కొత్త సంవత్సరంలో శుభవార్తను తెలిపింది. ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు మరియు మలయాళంలో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. డౌన్లోడ్ చేసుకునేందుకు మరియు షేర్ చేందుకు కీ ఆర్ట్ ఇప్పుడు అందుబాటులో ఉంది.
మార్వెల్ స్టూడియోస్ వారి “బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్”లో, క్వీన్ రామోండా (ఏంజెలా బాసెట్), షురి (లెటిటియా రైట్), ఎమ్బాకు (విన్స్టన్ డ్యూక్), ఓకోయ్ (దానై గురిరా) మరియు డోరా మిలాజే (ఫ్లోరెన్స్ కసుంబాతో సహా) తమ రాజు టి’చల్లా మరణించిన తర్వాత తమ దేశంతో జోక్యం చేసుకునే ప్రపంచ శక్తుల నుంచి రక్షించేందుకు పోరాడతారు. వాకండన్లు తదుపరి అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, హీరోలు వార్ డాగ్ నాకియా (లుపిటా న్యోంగో) మరియు ఎవెరెట్ రాస్ (మార్టిన్ ఫ్రీమాన్)ల సహాయంతో కలిసి వకాండ రాజ్యానికి కొత్త మార్గాన్ని ఏర్పరుస్తారు. టెనోచ్ హుర్టా మెజియాను సముద్రగర్భంలో దాగి ఉన్న దేశాన్ని పాలించే నామోర్గా పరిచయం చేస్తూ, ఈ చిత్రంలో డొమినిక్ థోర్న్, మైకేలా కోయెల్, మాబెల్ కాడెనా మరియు అలెక్స్ లివినల్లి కూడా నటించారు. కెవిన్ ఫీగే మరియు నేట్ మూర్లు నిర్మించిన, ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ‘‘బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్’’ ఇప్పుడు థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.