Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుల్లు దాదా, తబర్, ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన హైదరాబాదీ సినిమా ''ఎఫ్ ఎమ్ 2 డబుల్ మస్తీ'' షాన్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై మహమ్మద్ మిను ఖాన్ డైరెక్షన్లో, మహమ్మద్ షాహిద్ అలీ సిద్ధిక్ నిర్మించారు. ఒలి మహమ్మద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమా జనవరి 6న రిలిజ్ అయిన ఈ చిత్రం అన్ని సెంటర్స్ లోను హిట్ టాక్తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది.. ఈ సందర్భంగా నిర్మాత మహమ్మద్ షాహిద్ అలీ సిద్ధిక్ మాట్లాడుతూ: నూతన సంవత్సరంకానుకగా జనవరి6న రిలీజ్ అయిన మా ఎఫ్ ఎమ్2 డబుల్ మస్తీ సినిమా ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. హైదరాబాదీ సినిమాగా అన్ని ఏరియాల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. గుల్లు దాదా తమర్ ప్రియ ల నటన కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మ్యాజిక్ స్క్రీన్ ప్లే తో అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్. ఈ సినిమా లో నటించిన నటి నటులకు టెక్నీషియన్స్ కు ధన్య వాదములు అని అన్నారు.